‘కిలిమంజారో’ను అధిరోహించిన భువనగిరి యువతి

by Shyam |
‘కిలిమంజారో’ను అధిరోహించిన భువనగిరి యువతి
X

దిశ, భువనగిరి : ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారో పర్వత శిఖరాన్ని (5,895 మీటర్లు) యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన పడమటి అన్వితా‌రెడ్డి అధిరోహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి ఫోటో‌తో కూడిన బ్యానర్‌ని కిలిమంజారో పర్వతం‌పై అన్వితా‌రెడ్డి ప్రదర్శించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఓయూ క్యాంపస్‌లోని ఆంధ్రమహిళా సభ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసిన అన్వితా‌రెడ్డి భువనగిరిలోని రాక్ క్లెంబింగ్​స్కూల్లో ట్రైనింగ్ పొందారు. ఈ నెల 15న స్పెషల్ బ్రాంచ్​జాయింట్​పోలీస్ కమిషనర్​తరుణ్​ జోషితో కలిసి కిలిమంజారో ఎక్కడం ప్రారంభించి జనవరి 21 తెల్లవారుజామున పర్వతం పైకి చేరుకున్నారు. ఈ పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ తొలి యువతిగా పలువురు ఆమెను అభినందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed