కోటలో అన్యమత ప్రచారం.. అడ్డుకున్న యువకులు

by Sridhar Babu |   ( Updated:2021-12-17 23:34:34.0  )
Propaganda1
X

దిశ, బోథ్: బోథ్ మండలంలోని కోట(కే) గ్రామంలో అన్యమత ప్రచారం చేస్తున్న పలువురిని సొనల యువకులు అడ్డుకున్నారు. ఇకనుంచి ఇక్కడ ఎక్కడైనా అన్యమత ప్రచారం చేస్తే అడ్డుకుని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. అమాయకమైన ప్రజలను, వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని.. డబ్బులు ఎర చూపి మత ప్రచారం చేస్తూ వారిని అన్యమతంలోకి మార్చుతున్నారంటూ మండిపడ్డారు. పాస్టర్ల యొక్క ఆగడాలు శృతి మించిపోతున్నాయన్నాయరు. దీనిని వ్యాపారంగా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story