సోనూసూద్ కోసం యువకుడి పాదయాత్ర

by Shyam |
సోనూసూద్ కోసం యువకుడి పాదయాత్ర
X

దిశ, పటాన్ చెరు: సమాజంలో ఇతరుల కోసం సహాయ కార్యక్రమాలు చేయడానికి అమ్మా, నాన్న స్ఫూర్తి అని పలు సందర్భాల్లో ప్రముఖ సినీ నటుడు సోను సూద్ పేర్కొన్నారు. ఆయన మాటలను విన్న ఓ యువకుడు స్ఫూర్తి చెంది ఆయనను కలిసి దర్శనం చేసుకునేందుకు హైదరాబాద్ నుండి ముంబై కి పాదయాత్రగా బయలు దేరిన పేదింటి ఇంటర్ విద్యార్థి. ఈ కరోనా టైమ్‌లో ‘గివింగ్‌ బ్యాక్‌ టు సొసైటీ’ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించుకునే విధంగా వినూత్న ప్రయత్నంతో పాదయాత్ర మొదలు పెట్టాడు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జాతీయ రహదారిలో కనిపించిన దృశ్యం…. కరోన కాలంలో కుల, మతాలకు అతీతంగా ఆపదలో ఉన్నవారికి నేనున్నాను అంటూ చేతనైన సాయం చేస్తున్న రియల్ హీరో సోనుసూద్ ను కలవడం కోసం హైదరాబాద్ నుండి ముంబై కి పాదయాత్రగా బయలుదేరిన పేదింటి యువకుడు ఇంటర్ విద్యార్థి వెంకటేష్.

ఇతను వికారాబాద్ జిల్లా, దోమ మండలం, దోర్నాలపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ తల్లి చనిపోవడంతో తండ్రి అంజిలయ్య ఆటో డ్రైవర్ గా హైదరాబాద్ నగరంలో జీవనం గడుపుతున్నాడు. కరోన నేపథ్యంలో ఆటో ఫైనాన్స్ డబ్బులు కట్టకపోవడంతో ఆటో లాక్కెలడంతో జీవనస్థితి కఠినంగా మారిందని, వెంకటేష్ ఓ హోటల్ లో పనిచేస్తూ విద్య కొనసాగిస్తున్నాడు. సోనూసూద్ చేస్తున్న పనులకు ఆకర్షితుడై ఆయనను కలిసి తనగొడు వినిపించుకునేందుకు, ఆయన మార్గంలో నడిచేందుకు గాను పాదయాత్రగా ముంబై బయలుదేరాడు. మార్గ మధ్యలో ఉన్న మతాలకు అతీతంగా ఉన్న ప్రతి దేవుణ్ణి సోనూసూద్ యోగ క్షేమాల కోసం పూజలు చేస్తూ పాదయాత్రగా బయలుదేరాడు. ఇతని పాదయాత్రతో పాటు ఆశయం నెరవేరాలని అతడిని చూసిన ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed