- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటి నుంచి వెళ్లి..శవమై.. ఏం జరిగింది..?
దిశ, మోత్కూరు: దాచారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన మండలంలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. దాచారం గ్రామానికి చెందిన బోళ్ల సంపత్(38) ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ.. మోత్కూరు లో నివాసం ఉంటున్నాడు. గత రెండు రోజుల క్రితం ఊర్లో చేపలు పడుతున్నారని కుటుంబంతో గ్రామానికి వెళ్ళాడు. మంగళవారం సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో ఫైనాన్స్ ఇచ్చేది ఉందంటూ.. ఇంటి నుంచి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. సంపత్ ఇంటి నుండి వెళ్ళిన కొంతసేపటికే నార్కట్‌పల్లికి చెందిన ఇద్దరు సంపత్ తమకు ఫైనాన్స్ డబ్బులు ఇస్తా రమ్మన్నాడని సంపత్ ఇంటికి వచ్చారు. అయితే అదే సమయంలో వర్షం కురియడంతో వారు సంపత్ ఇంటివద్దనే ఉన్నారు. వర్షం వెలిసిన అనంతరం సంపత్‌కు కుటుంబీకులు ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోను లిఫ్ట్ చేయకపోవడంతో, అతనికోసం గాలించగా గ్రామశివారులోని కమ్మరిబావి వద్ద రోడ్డుపై అతని బండి పడి ఉండడంతో పాటు ఆ పక్కన చింతచెట్టు కింద సంపత్ పడి ఉండటాన్ని గమనించారు.
సెల్‌ఫోన్ లైట్ వెలుగులో చూడగా అతను చెవి నుంచి రక్తస్రావమై ఒంటి పైన ఉన్న బట్టలు నలిగిపోయి అపస్మారక స్థితిలో ఉండగా కదిపి చూసిన ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పిడుగుపాటుకు గురై ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. కాగా అతన్ని ఎవరో హత్య చేశారనే ప్రచారం జోరుగా సాగింది. మృతుని సోదరుడు రఘుపతి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం శివాని రామన్నపేట సివిల్ హాస్పిటల్‌కి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి ఉదయ్ కిరణ్ తెలిపారు.