బైక్ దావత్ ఇచ్చాడు.. నిమిషాల్లోనే విషాదం..

by Sumithra |
బైక్ దావత్ ఇచ్చాడు.. నిమిషాల్లోనే విషాదం..
X

దిశ, కీసర : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కీసరగుట్టకు స్నేహితులతో కలిసి వచ్చిన నరేష్, కొత్త బైక్ దావత్ పేరుతో పార్టీ చేసుకున్నారు. అనంతరం మద్యం సేవించి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంతలో కీసర చౌరస్తా నుండి ఈసీఐఎల్ వైపు బైక్‌( TS 10 EY 9238 )పై వస్తున్న నరేష్.. ఎదురుగా వస్తున్న డీసీఎం( TS 12 UB 0542 )ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తార్నకకు చెందిన నరేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. బైక్ వెనక కూర్చున్న మరో వ్యక్తి జీవన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ (108)లో తీవ్ర గాయాలైన జీవన్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story