క్వారంటైన్ నుంచి యువకుడి ఎస్కేప్

by srinivas |
క్వారంటైన్ నుంచి యువకుడి ఎస్కేప్
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో కరోనా సోకిన యువకుడు సామాజిక బాధ్యత మరిచి వ్యవహరించాడు. క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచిస్తే అక్కడి నుంచి తప్పించుకోవడమే కాకుండా, బయట కలియతిరుగుతూ తోటి ప్రజానీకాన్ని రిస్క్‌లో పడవేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని గురజాల లక్ష్మీటాకీస్‌ సెంటర్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన యువకుడిని ఐదు రోజుల కిందట వైద్యాధికారులు చిలకలూరిపేటలోని క్వారెంటైన్‌కు తరలించారు. అతడు అక్కడి నుంచి తప్పించుకుని బుధవారం గురజాలకు వచ్చాడు. వీధుల్లో యథేచ్చగా తిరుగుతూ ఉన్నాడు. అధికారులు ఇంట్లోనే ఉండాలని హెచ్చరించినా.. వినకుండా అతనికి తోచినట్లు చేస్తూ వచ్చాడు. గమనించిన స్థానికులు వైద్యాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరిగి క్వారెంటైన్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed