- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. కరెంట్ షాక్‌తో యువకుడు మృతి
by Sridhar Babu |
X
దిశ, జమ్మికుంట : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జమ్మికుంట పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన తూముల వేణు(36) అనే వ్యక్తి టెంట్ హౌస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
వీణవంక రోడ్డులోని ఎస్‌బీఐ సమీపంలో టెంట్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కాగా మృతుని స్వగ్రామం హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి. బతుకుదెరువు నిమిత్తం జమ్మికుంటకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు.
Advertisement
Next Story