క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి

by Sumithra |
Lalith Kumar
X

దిశ, ఘట్‌కేసర్: బ్యాట్ బాల్ ఆడుతూ ఓ యువకుడు అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన ఆదివారం ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఔషపూర్ గ్రామంలో లలిత్‌కుమార్(27) క్రికెట్ ఆడుతుండగా బంతిని పట్టుకోవడానికి పరిగెత్తి కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే మిగిలిన జట్టు ఆటగాళ్లు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ అతనిని పరిశీలించి అతడు మృతి చెందినట్లు తెలిపాడు. తన కుమారుడి మరణంపై ఎటువంటి అనుమానం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story