- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. ఆ కార్యక్రమానికి ఇంటిని సిద్ధం చేస్తుండగా పెళ్లి కొడుకు మృతి
దిశ, మహబూబాబాద్ టౌన్: ఇంటి మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తో యువకుడు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో17వ వార్డు రామన్నపేట కాలనీ చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణానికి చెందిన గూగులోత్ బాబు నాయక్ రెండో కుమారుడు జ్ఞానేశ్వర్ (23) బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరింది. ఈ క్రమంలోనే ఇంటి మరమ్మతులు చేస్తుండగా 33 కె.వి. విద్యుత్ లైన్ ఆనుకొని జ్ఞానేశ్వర్ మృతి చెందాడు. ఇదే ఘటనలో అతని అన్న వేణు గోపాల్, మరో వ్యక్తి సైతం గాయపడ్డారు. వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కమిషనర్ ప్రసన్న రాణి, విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి కావలసిన యువకుడు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.