- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గన్ మిస్ ఫైర్.. దోస్త్ ఇంటికొచ్చిన యువకుడు మృతి
X
దిశ ప్రతినిధి, మెదక్: గన్ మిస్ ఫైర్ అవ్వడంతో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్ పూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హైదరాబాద్ కు చెందిన ఎనిమిది మంది ముస్లిం యువకులు తన స్నేహితుడైన సలాక్ పూర్ గ్రామానికి చెందిన ఫజిల్ ఇంటికి వచ్చారు. వీరంతా సరదాగా విందు చేస్తున్న క్రమంలో షికారు చేసేందుకు ఉపయోగించే గన్ మిస్ ఫైర్ అయి ముసాఫ్ ఎస్.కే (20) తలకు బలంగా తగిలింది. వెంటనే సిద్దిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Advertisement
Next Story