- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నగ్నవీడియో ఖరీదు.. రూ.22 వేలు
దిశ, వెబ్‌డెస్క్: ఓ యువకుడికి గుర్తు తెలియని మహిళ వాట్సాప్ లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే సదరు మహిళ ఓ రోజు వాట్సప్ వీడియో కాల్ చేసి యువకుడిని నగ్నంగా కన్పించాలంటూ కోరింది. దీంతో అతడు ఆ మహిళ చెప్పినట్లుగానే నగ్నంగా కన్పించాడు. తనకు రూ. 50 వేలు ఇవ్వాలని లేకుంటే నగ్న వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. అందుకు తన దగ్గర అంత డబ్బులు లేదని.. రూ.22 వేలు చెల్లించాడు.
అనంతరం మళ్లీ డబ్బులు డిమాండు చేయడంతో ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు(26) వాట్సప్‌లో ఓ గుర్తు తెలియని మహిళతో స్నేహం చేశాడు. తాను కాల్ సెంటరులో పనిచేస్తానని, మాది కేరళ అంటూ యువకుడిని పరిచయం పెంచుకుంది.
ఆ పరిచయం కాస్త పెరిగి సన్నిహితంగా మాట్లాడుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలోనే సదరు మహిళ తనను నగ్నంగా చూడాలని ఉందని యువకుడిని కోరింది. దీంతో యువకుడు అందుకు నిరాకరించాడు. కానీ యువతి తాను కూడా నగ్నంగా కన్పిస్తానని చెప్పడంతో యువకుడు వాట్సప్ వీడియో కాల్‌లో మహిళ ముందు నగ్నంగా ఫోజులిచ్చాడు. కాసేపటికే ఫోన్ కట్ అయింది.
మూడు రోజుల తర్వాత ఆ యువకుడికి మరో వ్యక్తి ఫోన్ చేశాడు.
నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే రూ.50 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అంత మొత్తం తాను ఇవ్వలేనని, రూ.22వేలు ఇస్తానంటూ యువకుడు ఆ వ్యక్తి చెప్పిన ఖాతాకు ఆదివారం ఆన్‌లైన్‌లో బదిలీ చేశాడు. అయినా సోమవారం తిరిగి కాల్ చేసి ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించాడు. దీంతో బాధిత యువకుడు సైంబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.