గార్బేజ్ క్యారియర్‌గా బీఎండబ్ల్యూ కారు

by Shyam |   ( Updated:2020-11-24 08:24:32.0  )
గార్బేజ్ క్యారియర్‌గా బీఎండబ్ల్యూ కారు
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యాకు చెందిన యూ‌ట్యూబర్‌ మైఖేల్‌ లిట్విన్‌ తను ఇష్టపడి కొనుక్కున్న కోట్ల ఖరీదైన మెర్సిడెస్ బెంజ్‌ కారును కాల్చేసిన విషయం తెలిసిందే. తరుచూ బ్రేక్‌డౌన్‌ అవుతూ ఇబ్బందిపెట్టిన ఆ కారును ఎన్నిసార్లు రిపేర్‌ చేయించినా ఫలితం లేకపోవడంతో విసుగు చెందిన మైఖేల్.. తన కారును కాల్చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అచ్చం ఇలాంటి ఉదంతమే జార్ఖండ్‌లోని రాంచీలోనూ జరిగింది. కాకపోతే ఇక్కడ కారును కాల్చలేదు కానీ, రోడ్డుమీద చెత్తనంతా కారులో వేసుకుని తన నిరసన తెలియజేయడం విశేషం.

రాంచీకి చెందిన వ్యాపారి ప్రిన్స్ శ్రీవాస్తవ్.. తన తండ్రికి కానుకగా ఇచ్చేందుకు బీఎండబ్ల్యు కారును ఏడాదిన్నర క్రితం కొనుగోలు చేశాడు. అయితే ఆ కారు కొన్నప్పటి నుంచి దానికి తరచుగా రిపేర్స్ వస్తున్నాయి. కారు కొనుగోలు చేసిన పదో రోజే టైర్ పగిలిపోయింది. 20వ రోజు మరో టైర్ పేలిపోయింది. డీలర్ దగ్గరకు వెళితే రిప్లేస్ చేయకుండా, స్టెప్నీ వాడుకోమని సలహా ఇచ్చాడు. దీంతో వెహికల్ యాక్సెల్ బెండ్ అయ్యింది. దీన్ని ఫిక్స్ చేయాలంటే మనీ పే చేయాలని, ఇది ఇన్సూరెన్స్ కిందకు రాదని సదరు డీలర్.. శ్రీ వాస్తవ్‌తో చెప్పాడు. ఇవి కొన్ని సంఘనలు మాత్రమే కాగా.. ఆ కారుతో తరచూ ఇలాంటి సమస్యలే ఎదురయ్యేవి. ఇలా ఏడాదిన్నరగా ట్రబుల్ ఇస్తుండటంతో చేసేదేం లేక తన బీఎండబ్ల్యు కారును రోడ్డుపై పడిన చెత్తను ఎత్తేందుకు వినియోగిస్తూ, అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘90 లక్షలు పెట్టి కారు కొన్నాను. పదో రోజు నుంచి కారుతో సమస్య మొదలైంది. తరచూ కారును సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకెళ్లేవాడిని. ఎన్నో డబ్బులు ఖర్చు చేశాను. కానీ కారు తీరుమారకపోగా, సర్వీస్ సెంటర్ యజమానులు కూడా విసుగు చెందారు. కారు విషయంలో త్వరలోనే కోర్టుకు వెళతాను’ అని శ్రీవాస్తవ్ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed