- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పక్కా ప్లాన్‌తో ATMలో చోరీకి యత్నం.. సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు
దిశ, జల్‌పల్లి: HDFC ATM సెంటర్‌లో చోరీకి యత్నించిన యువకున్ని బాలాపూర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ వివరాల ప్రకారం.. షాహిన్ నగర్ క్యుబా కాలనీకి చెందిన మహ్మద్ అమేర్(24) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ.. జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో షాహిన్నగర్‌లోని HDFC ATM వద్దకు మరో డ్రైవర్‌తో చేరుకున్నాడు. ఏటీఎం మిషన్‌ను స్క్రూ డ్రైవర్‌తో ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో పెట్రోలింగ్ చేసోన్న బాలాపూర్ కానిస్టేబుళ్లు దయానంద్, చెన్నయ్యలు ఏటీఎం వద్దకు వచ్చారు. దీంతో పోలీసులకు ఆమేర్ అనుమానాస్పదంగా కనిపించాడు. అనుమానం వచ్చిన పోలీసులు ఏటీఎం లోపలికి వెళ్లి చూడగా మిషన్ ధ్వంసం అయి ఉండటాన్ని గమనించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.