అవును.. కరోనా చైతన్యం తీసుకొచ్చింది!

by sudharani |   ( Updated:2020-10-13 08:08:56.0  )
అవును.. కరోనా చైతన్యం తీసుకొచ్చింది!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజల జీవనం కరోనాకు ముందు.. ఆ తర్వాత అనేలా ఉన్నది. గతంలో అవసరం ఉన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేసిన జనం.. ప్రస్తుతం వాటి కోసమే పరుగులు పెడుతున్నారు. గతంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ తీసుకోమని ఏజెంట్లు ఇళ్ల చుట్టు తిరిగేవారు. కనబడిన ప్రతి పరిచస్తుడిని ఇన్సూరెన్స్ పాలసీలు చేయమని అడిగేవారు. వారి నుంచి అందరూ తప్పించుకుని తిరిగే వాళ్లు. కానీ ప్రస్తుతం పరిస్థితులు తిరగబడ్డాయి. కరోనా ప్రజల అవసరాలను మార్చేసింది. మా పేరుపై ఇన్సూరెన్స్ చేయమని ఏజెంట్ల వెంట పడుతున్నారు.

కళ్లు తెరిపించిన ప్రైవేట్ ఆస్పత్రులు

కరోనా వచ్చాక ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బతిన్నది. దీంతో ప్రజల జీవన వ్యవస్థ మారింది. కరోనా సోకినా, ఇతర చికిత్సలకు ఆస్పత్రికి వెళ్లాలంటేనే ఆస్తులు అమ్మకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు నిల్.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులు ఫుల్ లా మారింది. దీంతో చిన్న జ్వరం వచ్చినా లక్షలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అంత డబ్బు పెట్టే స్థోమత లేక, ప్రాణం మీద ఉన్న భయంతో అందరు ఇన్సూరెన్స్ కంపెనీల మెట్లు ఎక్కుతున్నారు. హెల్త్ పాలసీలు తీసుకోవడానికి ప్రజలు ఏజెంట్ల దగ్గరి పరుగులు పెడుతున్నారు. ఇన్సూరెన్స్ ఆఫీసుల ఎదుట క్యూ కడుతున్నారు.

ఎవరెవరు తీసుకుంటున్నారంటే..

ప్రస్తుతం కరోనా ఇన్సూరెన్స్ , సీజనల్ వ్యాధులకు సంబంధించిన స్పెషల్ ఇన్సూరెన్స్ లు ఎక్కువగా చేస్తున్నారు. వీటిపై ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. 42 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న వారు టర్మ్ ఇన్సూరె న్స్‌‌లను తీసుకుంటున్నారు. అంటే 77 శాతం మంది టర్మ్ ఇన్సూరెన్స్‌‌లను కొన్నారు. పాలసీల కొనుగోళ్లలో 31 నుంచి 35ఏళ్ల వారు 30శాతం షేర్ తో ఫస్ట్ ప్లేస్‌‌లో ఉన్నారు. హై నెట్‌ వర్త్‌‌ ఇండివిడ్యువల్ సెగ్మెంట్‌ లో 80 శాతం మందికి పైగా కస్టమర్లు కోటి రూపాయలు, ఆపై ఎక్కువ కవర్‌‌‌‌ను తీసుకున్నారు. వారిలో 25 శాతం మంది 2 కోట్ల నుంచి 5 కోట్ల కవర్‌‌‌‌ను ఎంపిక చేసుకున్నారు. ఏదిఏమైనా ప్రజల్లో ఇన్సూరెన్స్‌లపై అవగాహన రావడం శుభసూచికంగా భావించవచ్చు.

Advertisement

Next Story