- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండుగ ఆఫర్లను ప్రకటించిన యెస్ బ్యాంకు!
దిశ, వెబ్‌డెస్క్: ఇదివరకు మందగమనం, ప్రస్తుత కరోనా సంక్షోభం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకున్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా వినియోగదారులకు ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను ఇస్తున్నాయి. తాజాగా దేశెయ ప్రైవేట్ రంగ యెస్ బ్యాంక్ పండుగ ఆఫర్లను ప్రకటించింది. తక్కువ ఈఎంఐ, గిఫ్ట్ ఓచర్లు, ప్రాసెసింగ్ ఫీజులో రాయితీ, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. గృహ రుణాల నుంచి వాహన రుణాల వరకు పలు ఆఫర్లను యెస్ బ్యాంకు వెల్లడించింది. ఎలాంటి ఇబ్బందులు లేని వ్యక్తిగత, వ్యాపార, వాహన రుణాలను అందించనున్నట్టు యెస్ బ్యాంకు పేర్కొంది.
కార్ల కొనుగోలుకు సంబంధించి 7.99 శాతం వడ్డీ రేటుతో రుణాలను అందించనున్నట్టు, ఆన్‌రోడ్ ధరపై 100 శాతం రుణాలను ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. ఈ వడ్డీ కాలపరిమితో 8 ఏళ్లు ఉంటుందని, ఆరేళ్ల కాలపరిమితిపై 10.49 శాతం వడ్డీ ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా, యూజ్‌డ్ కార్లపై కూడా 100 శాతం రుణాలను ఇవ్వనున్నట్టు, ద్విచక్ర వాహనాలపై 10.99 శాతం వడ్డీతో 12 నుంచి 84 నెలల కాలపరిమితి ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా, ఆటో, వ్యాపార రుణాలపై సులభమైన చెల్లింపుల ప్రణాళికను అమలు చేస్తున్నట్టు యెస్ బ్యాంకు ప్రకటనలో పేర్కొంది.
రూ. 50 లక్షల వరకు వ్యక్తిగత రుణాలపై అత్యధికంగా 72 నెలల కాలపరిమితిపై 10.45 శాతం వడ్డీ రేటు ఇస్తున్నట్టు పేర్కొంది. అదేవిధంగా నెలకు రూ. 9 వేల ఆదాయం వస్తున్న వారికి కూడా అందుబాటులో నివాసాలను కొనుగోలు చేసేందుకు రుణాలు ఇవ్వనున్నట్టు బ్యాంకు వెల్లడించింది. వీటితో పాటు బంగారం రుణాలపై వడ్డీ రేటులో ఆఫర్ ఇస్తామని, ఆభరణాల తాకట్టుపై తీసుకునే రుణాలకు 10.99 శాతం వడ్డీ రేటు ఉంటుందని బ్యాంకు తెలిపింది. అలాగే, బంగారం విలువలో 90 శాతం రుణాన్ని ఇవ్వనుంది. వ్యాపార రుణాలపై 15.75 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు పేర్కొంది.