రూ. 10 వేల కోట్ల నిధుల సమీకరణకు యెస్ బ్యాంక్ బోర్డు ఆమోదం

by Harish |
రూ. 10 వేల కోట్ల నిధుల సమీకరణకు యెస్ బ్యాంక్ బోర్డు ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.10,000 కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు యెస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. గురువారం జరిగిన బ్యాంకు డైరెక్టర్ల సమావేశంలో రుణ సెక్యూరిటీల జారీ ద్వారా దేశీయ లేదా విదేశీ కరెన్సీలో నిధులను తీసుకునేందుకు వాటాదారుల ఆమోదం కోరినట్టు, దీనికి బోర్డు అనుమతిచ్చినట్టు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

జారీ చేయవలసిన సెక్యూరిటీలలో బాండ్లు, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు సహా ఇతర రుణ సెక్యూరిటీలున్నాయి. గురువారం రుణ సమీకరణకు బోర్డు ఆమోదం నేపథ్యంలో యెస్ బ్యాంక్ షేర్ ధర దాదాపు 3 శాతం పెరిగి రూ. 14.64 వద్ద ముగిసింది. కాగా, ఇటీవల బ్యాంకు వెల్లడించిన త్రైమాసిక ఫలితాల్లో యెస్ బ్యాంకు రూ. 3,788 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. ఆదాయం రూ. 4,805 కోట్లకు తగ్గినట్టు వెల్లడించింది.

Advertisement

Next Story