బెంగళూరు ఘటనపై యడ్యూరప్ప సీరియస్

by Anukaran |   ( Updated:2020-08-11 23:28:53.0  )
బెంగళూరు ఘటనపై యడ్యూరప్ప సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరు ఘర్షణపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు. దాడుల్ని, పుకార్లను ప్రభుత్వం సహించబోదని, దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

కాగా, ఓ వర్గాన్ని కించపరిచేలా కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టాడంటూ ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటిని తగులబెట్టారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులుపై కూడా రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. అదేవిధంగా ఆందోళకారుల రాళ్ల దాడిలో 60 మంది పోలీసులకు గాయలయ్యాయి.

ఈ ఘటన దృష్ట్యా ఘటనాస్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. బెంగళూరు వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. డీజే హళ్లి, కేజీ హళ్లిలో కర్ఫ్యూ విధించారు.

Advertisement

Next Story

Most Viewed