త్వరగా తేల్చండి.. ప్రత్యేక హోదా ఇచ్చుంటే తామే నెంబర్ వన్..?

by srinivas |
mp vijaya sai-reddy
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రత్యేక హోదాపై తక్షణమే చర్చ జరపాలని కోరుతూ రూల్‌ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ జరపాలని కోరారు. అన్ని అంశాలను పక్కనపెట్టి ప్రాధాన్యత అంశంగా రూల్‌ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను నోటీసులో వివరించారు. రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ప్రధాని ఏపీకి అనేక హామీలు ఇచ్చారని వాటిలో ప్రత్యేక హోదా అత్యంత ప్రధానమైనదని తెలిపారు.

1మార్చి2014లో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందని గుర్తుచేశారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి దాదాపు ఏడేళ్లు కావొస్తున్నా నేటికి అమలుకాకపోవడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా ఉండేదన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్‌ చేసి ప్రత్యేక హోదాపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తన నోటీసులో రాజ్యసభ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed