వైసీపీ నేత విజయసాయిరెడ్డికి కరోనా

by Anukaran |   ( Updated:2020-07-21 11:18:24.0  )
వైసీపీ నేత విజయసాయిరెడ్డికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్ :
ఏపీ అధికార పార్టీకి చెందిన కీలక నేత, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వైరస్ బారిన పడగా, తాజాగా విజయసాయి రెడ్డికి, ఆయన పీఏకూ కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వైసీపీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. వెంటనే ఆయన, అతని పీఏ హైదారాబాద్‌లోని అపోలో ఆస్ప్రతిలో అడ్మిట్ అయ్యారు. కొవిడ్ సోకడంతో వారం నుంచి పది రోజుల వరకు క్వారంటైన్ లో ఉంటానని.. ఎవరికీ అందుబాటులో ఉండబోనని ఎంపీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

Advertisement

Next Story