Darshi News: వైసీపీ ఎమ్మెల్యే వేణుగోపాలరావు పరుగో పరుగో...!

by srinivas |   ( Updated:2023-01-26 11:20:10.0  )
Darshi News: వైసీపీ ఎమ్మెల్యే వేణుగోపాలరావు పరుగో పరుగో...!
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు మన ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కొంతమంది మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు పరాభవం ఎదురవుతోంది. ప్రజలు నేతలను నడిరోడ్డుపై కడిగిపారేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గడప గడపకు అంటేనే ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు.

అయితే తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. కార్యకర్తలతో కలిసి ఓ ఇంటికి వెళ్తుండగా వారందరినీ చూసిన ఓ గేదె బెదిరిపోయింది. తాడు తెంచుకుని పరుగులు తీసింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ఇక పరుగో పరుగో అన్నట్లు పరుగులెత్తి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గడప గడపకు తిరుగుతున్నారు. చింతలపూడిలో వైసీపీ కార్యకర్తలతో కలిసి ఓ ఇంటికి వెళ్తుండగా జనాలను చూసి గేదే బెదిరిపోయింది. ఒక్కసారిగా తాడు తెంచుకుని పరుగెత్తింది.

దీంతో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌రావుతో పాటు వైసీపీ నేతలు భయంతో హడిలిపోయారు. అక్కడి పరుగులు తీశారు. ఎమ్మెల్యే వేణుగోపాలరావు అయితే ఓ ఇంటి ప్రహరీ గోడ ఎక్కి ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఇంటి యజమాని గేదెను కట్టివేయడంతో ఎమ్మెల్యేతోపాటు అంతా అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి: Pawan Kalyanపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Ap News: రాష్ట్రంలో నియంత్రత్వ పాలకుల్ని తరిమికొట్టాలి: వర్ల రామయ్య

Advertisement

Next Story