‘మీకే దిక్కులేదు.. పవన్‌కల్యాణ్‌ని సీఎం చేస్తారా’

by srinivas |
‘మీకే దిక్కులేదు.. పవన్‌కల్యాణ్‌ని సీఎం చేస్తారా’
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ-జనసేన కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కల్యాణ్ అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించడంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. రాష్ట్రంలో బీజేపీకే దిక్కులేదు అలాంటిది పవన్‌కల్యాన్‌ను ముఖ్యమంత్రిని చేసేస్తారంటూ అంటూ ఎద్దేవా చేశారు. పవన్‌కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేముందు సాధ్యాసాధ్యాలపై చర్చించారా అని ప్రశ్నించారు. అసలు జనసేనకు ఎన్ని సీట్లు ఉన్నాయి అని నిలదీశారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీజేపీ పవన్‌ను సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించిందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ త్వరలోనే పార్టీలోకి వస్తారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రకటన చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. చంద్రబాబు, లోకేష్‌ వల్ల ఈ పార్టీ ఇక బతకదని వాళ్లకూ అర్ధమైపోయిందంటూ సెటైర్లు వేశారు. ఎవరు వచ్చినా టీడీపీ తిరిగి బతకదని.. చంద్రబాబు హయాంలోనే అంతర్ధానం కాక తప్పదన్నారు. తెలుగు తమ్ముళ్లూ వేరే మార్గం చూసుకోవడం మంచిదంటూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు.

Advertisement

Next Story