గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం

by Ramesh Goud |
గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం
X

దిశ, వెబ్ డెస్క్: గుడ్ ఫ్రైడే (Good Friday) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక సందేశం ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. యేసు క్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా యేసు ప్రభు ప్రేమ, కృప కటాక్షాలు ఎప్పుడూ ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. అలాగే శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు.

క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెబుతూ.. ప్రపంచానికి ప్రేమ తత్వం బోధించిన దయామయుడు, సిలువపై యేసుక్రీస్తు త్యాగం మహోన్నతమైనదని ‘గుడ్ ఫ్రైడే’ సందేశం (Message)లో పేర్కొన్నారు. అంతేగాక కరుణామయుడి జీవితం మానవాళికి అందించిన సందేశమని, ప్రభు యేసు త్యాగాన్ని స్మరిస్తూ క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఆధ్యాత్మిక శాంతి కలగాలని సీఎం ప్రార్థించారు. ఇక క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.



Next Story

Most Viewed