ఏంట్రా ఇలా తయారయ్యారు.. రీల్ కోసం ఇంత బరితెగింపా!

by Aamani |
ఏంట్రా ఇలా తయారయ్యారు.. రీల్ కోసం ఇంత బరితెగింపా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో చాలా‌మంది సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్లు అవ్వాలనే కోరికతో ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు కోసం ఎక్కడ పడితే అక్కడ రీల్ తీయడం, ఫోటోలు దిగడం వంటివి పనులు చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. కొందరు అయితే ప్రాంక్ అనే నెపంతో దారిన పొయే వారిని భయ‌బ్రాంతులకు గురి చేస్తున్నారు. యువత ప్రమాదకర విన్యాసాలలో పాల్గొంటూ, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. రోడ్డుపై ఇష్టానుసారంగా డాన్స్‌లు చేస్తూ అల్లకల్లోలం చేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఒకటి బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బెంగళూరులో రీల్ కోసం బిజీ రోడ్డు మధ్యలో కుర్చీలో టీ తాగాడు. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కానీ, ఆ వీడియో చూసిన నెటిజన్లు ఇదేం పనిరా బాబు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లల్లో శుభకార్యాలకో లేదా సందర్భానుసారంగా విషయాలను షేర్ చేసుకొవలేగాని ఇలా రోడ్డుపై, ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఏంటా పిచ్చి వేషాలు అంటూ ఏకి పారేస్తున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న నేపథ్యంలో యువకుడు ఇలా చేయడం పలువురు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ‘జాగ్రత్త సుమా.. బెంగళూరు పోలీస్ మిమ్మల్ని గమనిస్తోంది’ అంటూ పోలీస్ శాఖ ట్వీట్ చేసింది.



Next Story

Most Viewed