Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వానలు

by D.Reddy |
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వానలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి. మరోవైపు అక్కడక్కడా వర్షాలు (Rains) కూడా పడుతున్నాయి. ఈ భిన్న వాతావరణ (Weather) మార్పులతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది. నేడు, రేపు తెలంగాణ, ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఈదురుగాలులు సైతం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

ఇక ఇవాళ తెలంగాణలోని కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాలపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని సూచనలు చేసింది.

అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని IMD తెలిపింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) కూడా తీర ప్రాంతాల్లో అధిక ఆటుపోట్లు ఉండవచ్చని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.



Next Story

Most Viewed