రఘురామకృష్ణకు షాక్ ఇచ్చిన వైసీపీ చీఫ్ విప్

by Anukaran |   ( Updated:2021-06-11 04:55:24.0  )
raghurama krishnam raju
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పేరు తెలియని వారుండరు. గత కొంతకాలంగా ఆయన చేస్తున్న పొలిటికల్ హడావిడి అంత ఇంత కాదు. వైసీపీలో ఉంటూనే అధిష్టానానికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నారు. అన్నిటికీ మించి సీఎం జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ వేయడం సంచలనానికి దారి తీసింది. అన్ని రాష్ట్రాల సీఎంలకు, గవర్నర్లకు లేఖ రాయడం మరో విశేషం.

ఇక ఆయన దూకుడికి కళ్లెం వేసేందుకు వైసీపీ పెద్దలు సన్నాహాలు చేస్తున్నట్టు తెసులుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్., లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. ఈమేరకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన ఎంపీ రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌ కు ఫిర్యాదు చేశారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు మార్గాని భరత్.

Advertisement

Next Story

Most Viewed