బెయిల్‌పై బయటకొచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

by srinivas |   ( Updated:2021-02-06 09:08:41.0  )
బెయిల్‌పై బయటకొచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
X

దిశ, ఏపీ బ్యూరో: ఓ వార్డుకు పోటీ చేసిన వ్యక్తి బంధువును బెదిరించిన కేసులో శనివారం పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేని అరెస్టు చేశారు. అరెస్టైన కొద్దిసేపటికే స్టేషన్​బెయిల్​పై విడుదల చేశారు. విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వార్డు మెంబర్ అభ్యర్థి అల్లుడ్ని బెదిరించినట్లు ఆయన వాయిస్​సోషల్​ మీడియాలో వైరల్ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కన్నబాబు రాజు‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఆయన్ని రాంబిల్లి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed