- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యాదాద్రిలో అధికారుల ప్రత్యేక శ్రద్ధ

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే విషయంలో యాదాద్రి ఆర్టీసీ అధికారులు ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారు. ఎప్పటికప్పుడు కావాల్సిన విధంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించింది. విషయమేటంటే.. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట బస్టాండ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఎందుకంటే యాదాద్రి పుణ్యక్షేత్రం ఉన్నందున యాదగిరిగుట్టకు రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే జనాలు వేలసంఖ్యలో ప్రయాణిస్తుండడంతో వారిలో ఎవరిలో వైరస్ ఉందని నిర్ధారించే పరిస్థితి లేదు. అందువల్ల ఇది గమనించిన ఆర్టీసీ అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వచ్చిపోయే బస్సులను, డీపీలోని బస్సులను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అయితే బస్సులో ప్రయాణికులు ఎక్కువగా చేతులతో తాకే ప్రదేశాలను ఆర్టీసీ గుర్తించింది. ఆ ప్రదేశాలను రసాయనాలతో శుభ్రపరచాలని అధికారులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆర్టీసీ డిపో అధికారులు.. ఆర్టీసీ గుర్తించిన ఆ ప్రదేశాలను ఆ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ అనే రసాయనంతో బస్సులను శుభ్రపరుస్తున్నారు. అదేవిధంగా బస్టాండ్ లో వైద్యులతో కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
tags: yadadri, rtc, corona, cleaning