- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కట్టడికి షావోమీ సాయం
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ తనవంతు సాయాన్ని ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ఆరోగ్య శాఖలకు ఎన్95 మాస్కులు ఉచితంగా అందించనున్నట్లు షావోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు. అందుకోసం ఇప్పటికే లక్షకు పైగా ఎన్95 మాస్కులను దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు.
మొదటగా ఈ వారం కర్ణాటక, పంజాబ్, ఢిల్లీల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు, అత్యవసర సిబ్బందికి మాస్కులు సరఫరా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక తమ కంపెనీ పరంగా ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశంతో పాటు, బిజినెస్ ప్రయాణాలు కూడా రద్దు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా తయారీ కేంద్రాల్లో పరిశుభ్రత, సామాజిక దూరం మెయింటెయిన్ చేస్తున్నట్లు మను కుమార్ బహిరంగ లేఖ ద్వారా తెలిపారు.
Tags: Corona, COVID 19, Xiaomi, Punjab, Delhi, Karnataka, Manu kumar