- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా పెరిగిన ధరలు
దిశ, వెబ్‌డెస్క్: ముడిచమురు, తయారీ ఉత్పత్తుల ధరల కారణంగా మే నెలలో హోల్‌సేల్ ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మొత్తంగా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో కొనసాగడం ఇది వరుసగా ఐదో నెల కావడం గమనార్హం. అంతకుముందు ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈసారి 2.45 శాతం పెరిగిన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 12.94 శాతానికి చేరుకుంది. గతేడాది ఇదే నెలలో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 3.37 శాతం ప్రతికూలంగా నమోదవగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 10.49 శాతంగా నమోదైంది.
ఏప్రిల్ నెలకు సంబంధించి హోల్‌సేల్ ద్రవ్యోల్బణం మొదటిసారిగా రెండంకెల స్థాయిని తాకింది. ‘గతేడాది మేలో తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగానే ఈసారి డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణమైంది. దీనికితోడు ముడి చమురు, తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడంతో గతం కంటే ద్రవ్యోల్బణం జీవనకాల గరిష్టానికి చేరిందని’ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. సమీక్షించిన నెలలో తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 10.83 శాతానికి పెరగ్గా, ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం అత్యధికంగా 37.6 శాతానికి పెరిగింది. సమీక్షించిన నెలలో ఉల్లి ధరలు పెరిగినప్పటికీ ఆహార ధరల హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 4.31 శాతానికి క్షీణించింది. ఉల్లి ధరల పెరుగుదల మేలో 23.24 శాతంగా ఉంది.