- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే అతిపెద్ద గుహ.. ఎక్కడంటే
దిశ, ఫీచర్స్ : గుహలు.. కొన్ని కోట్ల సంవత్సరాల కిందటే ఏర్పడినట్లు శాస్త్రవేత్తల అంచనా. రాళ్లు కోతకు గురైనప్పుడో లేదా రసాయనిక చర్యలు, భూకంపాలు, తుఫాన్లు, నీటికోతలు, వాతావరణ ప్రభావం వంటి చర్యలతో గుహల ఆవిర్భావం జరిగినట్లు పలు అధ్యయనాల్లో తేలింది. మన దేశంలోని పలు ప్రదేశాల్లో్ రాతి శిల్పకళతో కలిగిన గుహలు ఉన్న విషయం తెలిసిందే. ఈ తరహా గుహల్లో మహారాష్ట్రలోని అజంతా గుహలు చాలా ఫేమస్. అయితే గుహ నిట్టనిలువు లోతు 3 వేల మీటర్లకు మించి ఉండదని పలువురు పరిశోధకుల అంచనా. కాగా, ప్రపంచంలో పొడవైన గుహను ఓ వ్యక్తి కనుగొన్నాడు. ప్రస్తుతం దాన్ని చూసేందుకు సందర్శకులు పోటెత్తుతుండటం విశేషం.
2013లో వియత్నాం దేశంలోని దట్టమైన అడవిలో ‘సన్ దూంగ్’ అనే గుహను హోమిన్ ఫుక్ అనే వ్యక్తి కనుగొన్నాడు. గుహకు వెళ్లే దారిని అతడు చూపించగా.. ఈ గుహ మిలియన్ ఏళ్ల కిందటిది అని పరిశోధకులు నిర్ధారించారు. ఈ గుహలో ఆకాశహర్మ్యాల వంటి 40 అంతస్థులు కట్టొచ్చని చెబుతున్నారు. గుహ మొత్తంగా 9 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉంది. ఇందులో 150 సెపరేట్ గుహలు, భూగర్భ అడవి, నదులు ఉన్నాయి. ఈ గుహలో ఎగిరే నక్కలు కూడా జీవిస్తున్న ఈ గుహను యునెస్కో WHS(ప్రపంచ వారసత్వ కేంద్రం)గా గుర్తించింది. ప్రస్తుతం దీనిని టూరిస్టు స్పాట్‌గా మార్చడంతో పర్యాటకులతో కిటకిటలాడుతోంది. అయితే కొవిడ్ వల్ల గతేడాది టూరిస్టులు ఎవరూ రాలేదని, ప్రస్తుతం సందర్శకుల తాకిడి పెరుగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.