US President Elections: ట్రంప్ గెలిస్తే మాకు కష్టమే- జెలెన్ స్కీ

by Shamantha N |
US President Elections: ట్రంప్ గెలిస్తే మాకు కష్టమే- జెలెన్ స్కీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఎన్నికల గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine President) వ్లాదిమిర్ జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. తమ దేశానికి కష్టమని అన్నారు. ట్రంప్ తో కలిసి పనిచేయడం కష్టమని జెలెన్ స్కీ (Volodymyr Zelensky)అన్నారు. కాగా.. జేడీ వాన్స్ ఇటీవలే ఉక్రెయిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ కు ఏం జరుగుతుందో తాము పట్టింకోమని తెలిపారు. లండన్‌లో జరిగిన యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సమావేశానికి హాజరైనప్పుడు జెలెన్ స్కీ మీడియాతో మాట్లాడాడరు. జేడీ వాన్స్ వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన ఉక్రెయిన్ యుద్ధం గురించి పట్టించుకోకపోవచ్చు కానీ.. తాము యూఎస్ తో కలిసి పనిచేస్తామ్నారు. ట్రంప్ ఎన్నిక వల్ల కష్టపడతామన్న ఆయన.. తాము హార్డ్ వర్కర్లమని గుర్తుచేశారు.

ఫైటర్ జెట్ లు అవసరం

ఇకపోతే, ఉక్రెయిన్ కు తమ భాగస్వామ్యులు ఎఫ్-16 ఫైటర్ జెట్(F-16 fighter jets) లను అందిస్తామని తెలిపారని పేర్కొన్నారు. కానీ, 18 నెలలు గడిచినప్పటికీ విమానాలు అందలేదన్నారు. తమపై రష్యా(Russia) ఆధిపత్యాన్ని నిరోధించేందుకు పైటర్ జెట్ లు చాలా అవసరమని ఆయన అన్నారు. ఉక్రెయిన్ విషయంలో బ్రిటన్ తీరు ఎప్పటికీ మారబోదన్నారు. మరోవైపు, అమెరికా కాంగ్రెస్‌లోని వివాదాల వల్ల ఉక్రెయిన్ ని చాలా కాలం పాటు అమెరికా సాయం అందించలేదు. చివరికి వారికి ఆయుధాలు, సామగ్రిని అందించింది. ఇకపోతే, బైడెన్ తో జరిగిన బిగ్ డిబేట్ తర్వాత ట్రంప్ ఉక్రెయిన్-రష్యా గురించి కీలకవ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజులోనే యుద్ధం ముగిస్తానని వ్యాఖ్యలు చేశారు. మాస్కో ఉక్రెయిన్ లోకి సైన్యాన్ని పంపినప్పుడు తాను అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదన్నారు.

Advertisement

Next Story

Most Viewed