దారుణం.. మహిళ ప్రాణం తీసిన హిస్టారికల్ ట్రైన్ తో సెల్ఫీ

by Prasad Jukanti |
దారుణం.. మహిళ ప్రాణం తీసిన హిస్టారికల్ ట్రైన్ తో సెల్ఫీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: డేంజర్ జోన్ లో సెల్పీల కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా మెక్సికోలో ఓ మహిళ చారిత్రాత్మకమైన రైలుతో సెల్పీకి ప్రయత్నించి మృత్యుఒడిలోకి చేరారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సదరు మహిళ తన కుమారుడు చదువుకునే పాఠశాలకు సమీపంలో ట్రైన్ ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ పై 1930లో నిర్మించిన 'ఎంప్రెస్' అని పిలవబడే స్టీమ్ రైలు ప్రయాణిస్తోంది. ఈ ట్రైన్ కెనడియన్ పసిఫిక్ కాన్సాస్ సిటీ (కేపీకేసీ)మధ్య సృష్టించిన స్నేహపూర్వక విలీనాన్ని జరుపుకోవడంలో భాగంగా తన చివరి ప్రయాణం గత ఏప్రిల్ లో కాల్గరీ నుంచి బయలుదేరింది. ఈ పర్యటన శుక్రవారం మెక్సికో సిటీలో ముగియనున్నది.

అయితే ఈ ట్రైన్ ప్రయాణిస్తున్న చోట్ల చాలా వరకు ప్రజలు గుమిగూడి ఆ రైలుతో ఫోటోలు, సెల్పీలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హిడాల్గో సమీపం వద్ద ఈ స్టీమ్ రైలును చూసేందుకు అనేక మంది తరలి రాగా తన కుమారుడితో పాటు మృతి చెందిన మహిళ కూడా వచ్చారు. అయితే అత్యూత్సాహంతో ఆమె ట్రాక్ కు సమీపంలో నిలబడి ట్రైన్ తో సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వెనుక వైపు నుంచి దూసుకువచ్చిన ట్రైన్ ఆమె తల భాగాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్షణాల్లో కిందపడిపోయిన మహిళ అందరూ చూస్తుండగానే ప్రాణాలు విండిచింది. దీంతో అప్పటి వరకు అక్కడ ఉల్లాసంగా కేరింతలు కొడుతూ గడిపిన ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

Advertisement

Next Story

Most Viewed