యూఎస్, దక్షిణ కొరియా మిలిటరీ డ్రిల్స్: తీవ్రంగా హెచ్చరించిన కిమ్

by samatah |
యూఎస్, దక్షిణ కొరియా మిలిటరీ డ్రిల్స్: తీవ్రంగా హెచ్చరించిన కిమ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా మిలిటరీ డ్రిల్స్ ప్రారంభించిన నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తీవ్రంగా హెచ్చరించాడు. తమ దేశంపై దాడి చేయడానికి ఇరు దేశాలు కుట్ర పన్నాయని, అందులో భాగంగానే సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. వీటిని వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేశారు. లేకపోతే ఇరు దేశాలు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉత్తరకొరియా సైన్యం తమ శత్రువుల చర్యలను గమనిస్తోందని, అస్థిర వాతావారణాన్ని నియంత్రించేందుకు అవసరమైతే సైనిక కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుందని నార్త్ కొరియా మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. యూఎస్-దక్షిణకొరియా విన్యాసాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ డ్రిల్స్‌ను అనుయుద్ధానికి రీహార్సల్‌గా అభివర్ణించారు. కాగా, యూఎస్-దక్షిణ కొరియాలు వారి వార్షిక కంప్యూటర్-సిమ్యులేటెడ్ కమాండ్ పోస్ట్ శిక్షణ, వివిధ రకాల డ్రిల్స్ సోమవారం ప్రారంభించాయి. అయితే వాటిని కేవలం రక్షణాత్మకమైనవని ఇరు దేశాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఉత్తరకొరియా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అనే విషయాలను కిమ్ స్పష్టం చేయకపోయినప్పటికీ తమ యుద్ధ సామర్థాన్ని పెంచుకోవడానికి ఖచ్చితంగా క్షిపణి పరీక్షలు చేపడతారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed