- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా రాజీనామా
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ రుస్లాన్ స్టెఫాన్‌చుక్ బుధవారం తెలిపారు. దీనిపై త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో శాసనసభ్యులు చర్చించనున్నారు. రష్యాకు వ్యతిరేకంగా 30 నెలలకు పైగా జరుగుతున్న యుద్ధంలో ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విదేశాంగ మంత్రి రాజీనామా చేశారు. మరికొద్ది రోజుల్లో మరిన్ని రాజీనామాలు చోటు చేసుకోవచ్చని, అలాగే కొత్త నియామకాలు కూడా జరగవచ్చని తెలుస్తుంది.
డిమిట్రో కులేబా మార్చి 2020లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పొరుగున ఉన్న రష్యా చేస్తున్న దండయాత్రను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో 2016-2019లో కౌన్సిల్ ఆఫ్ యూరోప్‌కు ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డారు. ఇదిలా ఉంటే, శీతాకాలానికి ముందు ప్రభుత్వం తన మంత్రివర్గంలో కొత్త ముఖాలను చూడాలని భావిస్తుంది. దాదాపు 50 శాతం కంటే ఎక్కువ మంది రాజీనామా చేయడంతో పాటు ఆ పదవుల్లో కొత్త వారిని నియమించనున్నట్లు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పార్టీకి చెందిన సీనియర్ శాసనసభ్యుడు డేవిడ్ అరాఖమియా మంగళవారం తెలిపారు.