- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యా అణ్వాయుధాల స్థావరంగా బెలారస్
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా బెలారస్‌లో అణ్వాయుధాలను ఉంచేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. మిత్ర దేశం బెలారస్‌లో వ్యుహాత్మక అణ్వాయుధాల మోహరింపు కొనసాగుతుందని చెప్పారు. రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాలను బెలారస్‌లో ఉంచేందుకు అంగీకారం తెలిపామని దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తెలిపారు. ఈ మేరకు అణ్వస్త్రాలను మోసుకెళ్లే స్వల్ప శ్రేణి వ్యవస్థను దాదాపు 30 ఏళ్లుగా అలెగ్జాండర్ బెలారస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతేడాది తమ భూభాగంలో నుంచి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించేందుకు రష్యాకు అనుమతించిన సంగతి తెలిసిందే.
మరోవైపు అణ్వాయుధాల నిర్ణయంపై ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశంలో అంతర్గతంగా అస్థిరీకరణకు దారి తీస్తుందని ఉక్రెయిన్ భద్రతా సలహాదారు ఒలెక్సీ డానిలోవ్ అన్నారు. పలు దేశాలు కూడా ఇతర దేశాల్లో తమ అణ్వాయుధాలను ఉంచాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఇది అసాధారణ విషయమేమీ కాదని చెప్పారు. మరోవైపు రష్యా చర్యలను నాటో విమర్శించింది. ఇది ప్రమాదకరమైన, బాధ్యతరహిత చర్యగా పేర్కొంది. తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని నాటో ప్రతినిధి తెలిపారు.