- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధ్యక్ష రేసులో ట్రంప్ దూకుడు: మరో మూడు రాష్ట్రాల్లో విజయం
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష రేసులో మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నాడు. ఇటీవల నిక్కీ హేలీ సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో ఆమెను ఓడించిన ట్రంప్ తాజాగా..మిస్సౌరీ, మిచిగాన్, ఇడాహో రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ట్రంప్ హేలీని సునాయాసంగా ఓడించారు. దాదాపు 98శాతం మంది మద్దతులో ట్రంప్ గెలుపొందారు. దీంతో ట్రంపునకు మద్దతు తెలిపిన ప్రతినిధుల సంఖ్య 244కు చేరుకోగా, నిక్కీ కేవలం 24 మందిని మాత్రమే కైవసం చేసుకున్నారు. ఒక అభ్యర్థి రిపబ్లికన్ నామినేషన్‌ను కైవసం చేసుకోవడానికి 1,215 మంది డెలిగేట్‌లను పొందాలి. తదుపరి ఎన్నికలు కొలంబియా జిల్లాలో జరగనున్నాయి. అనంతరం 16రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇది అతిపెద్ద ఓటింగ్ అవనుంది. మరోవైపు మిస్సౌరీ, మిచిగాన్, ఇడాహోలలో శనివారం జరిగిన ఓటింగ్ ఉద్రిక్తతలకు దారి తీసింది.
ట్రంప్, బైడెన్ మధ్యే పోటీ!
ఇప్పటికే అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్, సౌత్ కరోలినాలో గెలిచిన ట్రంప్ తాజా విజయంతో అధ్యక్ష రేసులో మరింత ముందుకు వెళ్లారు. రిపబ్లికన్ పార్టీ ప్రకారం.. నామినేటింగ్ కోసం జరిగే మొత్తం 13 జిల్లాల్లో ట్రంప్ హేలీని ఓడించారు. దీంతో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ మధ్య పోటీ ఉండనున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ బైడెన్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే.