Trump-Netanyahu: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌‌ను కలిసిన ఇజ్రాయెల్‌ ప్రధాని

by Harish |   ( Updated:2024-07-27 03:16:45.0  )
Trump-Netanyahu: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌‌ను కలిసిన ఇజ్రాయెల్‌ ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌‌ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం కలుసుకున్నారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లోని నివాసంలో ఈ ఇద్దరు సమావేశం అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను నెతన్యాహు సోషల్ మీడియా ఎక్స్‌లో పంచకున్నారు. ట్రంప్ తన నివాసానికి వచ్చిన నెతన్యాహును ఆప్యాయంగా పలకరించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన ఘోరమైన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో, 2020 ఎన్నికల్లో తాను గెలిస్తే గాజాలో యుద్ధం జరిగేది కాదని ట్రంప్ పదే పదే పేర్కొన్న తరుణంలో వీరు సమావేం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశంలో వారి సంబంధాన్ని పునరుద్ధరించడానికి కట్టుబడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వివాదాన్ని త్వరగా ముగించాలని నెతన్యాహును ట్రంప్ కోరారు. అలాగే, కమలా హారిస్‌ను ఇజ్రాయెల్ పట్ల స్నేహపూర్వకంగా లేని వ్యక్తిగా అభివర్ణించారు. ఈ ఇద్దరు నేతలు చివరిసారిగా 2020లో కలుసుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చడం ద్వారా ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని గుర్తించి నెతన్యాహుకు ఆయన మద్దతు ఇచ్చారు. అయితే ఇటీవల ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించాలని విమర్శలు చేస్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అమెరికాతో సంబంధాలను మరింత పెంచడానికి నెతన్యాహు అక్కడ పర్యటిస్తూ, దిగ్గజ నేతలను కలుస్తున్నారు.

Advertisement

Next Story