- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నమీబియాలో విషాదం: దేశ అధ్యక్షుడు గింగోబ్ కన్నుమూత

దిశ, నేషనల్ బ్యూరో: నమీబియా దేశ అధ్యక్షుడు హేగ్ గింగోబ్ (82) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశాడు. ఈ మేరకు నమీబియా అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న గింగోబ్ నమీబియా రాజధాని విండ్ హోక్‌లోని పోహంబా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి మృతి చెందినట్టు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అయితే గింగోబ్ వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లనున్నారని, ఫిబ్రవరి 2న తిరిగి నమీబియా తిరిగిస్తారని ఇటీవలే గింగోబ్ కార్యాలయం తెలపగా..ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే గింగోబ్ మరణించారు. 2014లో ప్రధానమంత్రిగా.. ఉన్నప్పుడు తాను ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి బయటపడ్డానని ప్రజలకు చెప్పారు. మరుసటి ఏడాది అధ్యక్షుడయ్యాడు. కాగా, నమీబియాలో ఈ ఏడాది చివరలో అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి.