ఉగాది నాడు చేయకూడని 5 ముఖ్యమైన పనులు

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-29 12:52:19.0  )
ఉగాది నాడు చేయకూడని 5 ముఖ్యమైన పనులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగాది పండుగ(Ugadi Festival) అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది భక్షాలు, ఉగాది పచ్చడి. పండుగ రోజున పొద్దున్నే ఇష్టదైవానికి పూజలు చేసి.. ఉగాది పచ్చడి తాగేసి.. భక్షాలు లాగించేస్తారు. ఆ తర్వాత రాశులు, జాతకాలు వంటివి తెలుసుకుంటారు. మళ్లీ ఎవరి పనిలో వారు నిమగ్నమైపోతుంటారు. అయితే ఉగాది పండుగరోజున కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని జ్యోతిష్య నిపుణులు(Astrology Experts) కీలక సూచనలు చేస్తున్నారు. కింద పేర్కొన్న వాటిని సరిగా అమలు చేయకపోతే.. ఏడాది మొత్తం అలాగే ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

చేయకూడదని 5 ముఖ్యమైన పనులు :

= డబ్బు అప్పుగా ఇవ్వకూడదు, గొడవలు పడకూడదు.

= ఏడవకూడదు, ఏడిపించకూడదు.

= నూతన వస్త్రాలు ధరించాలి, తల స్నానం చేయాలి.

= బొట్టు లేకుండా బయటకు రాకూడదు.

= పండుగపూట ఎవరితోనూ లేదు అనకూడదు.

ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఉగాది పండుగ జరగనుంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొన్ని రాశుల వారి జీవితం అద్భుతంగా మారనుందని జ్యోతిష్క శాస్త్ర నిపుణులు అంటున్నారు. జీవితంలో ఇన్ని రోజులు పడ్డ కష్టాలు ఓ కొలిక్కి వస్తాయని హామీ ఇస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story

Most Viewed