- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral video : ఏసీ లేకున్నా డోంట్ వర్రీ బ్రో..! ఇలా కూడా కూల్ అవ్వొచ్చు!!

దిశ, ఫీచర్స్ : అసలే సమ్మర్.. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా ఉక్కబోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటప్పుడు చల్లదనం కోసం ఏసీ, ఫ్యాన్, కూలర్ వంటివి ఉపయోగిస్తుంటారు చాలా మంది. కాగా అందరికీ ఏసీ వాడే స్థోమతో, అవకాశమో ఉండకపోవచ్చు. అలాంటి వారు ఫ్యాన్ యూజ్ చేస్తుంటారు. అయితే మారుతున్న ఉష్ణోగ్రతలతో సాధారణ ఫ్యాన్లు కూడా అంత ఉపశమనాన్ని ఇవ్వలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాంటి వారికోసమే ఇప్పుడు 360 డిగ్రీల డబుల్ హెడ్ రొటేటింగ్ ఫ్యాన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు.
వైరల్ సమాచారం ప్రకారం.. ‘స్మార్ట్ హోమ్ గాడ్జెస్ట్’ ఇస్టా హ్యాండిల్ ద్వారా ఉక్కబోతలకు ఇక వీడ్కోలు పలకండి అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో రెండు మూడు రకాల ‘360 డిగ్రీస్ డబుల్ హెడ్ రొటేటింగ్’ ఫ్యాన్లు రొటేట్ అవుతున్నాయి. అవి రిమోట్ కంట్రోలింగ్ సిస్టమ్ అండ్ స్మార్ట్ టెక్నాలజీపై ఆధారపడి నడుస్తుండగా.. కనీసం ఏమాత్రం శబ్దం కూడా రావడం లేదు. పైగా 360 డిగ్రీల రొటేటింగ్ సామర్థ్యం కలిగి ఉండటంతోపాటు సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే ఎక్కువ గాలి వీస్తున్నది. చల్లదనాన్ని కూడా ఎక్కువే ఇస్తుంది. త్వరగా వేడెక్కదు. అందుకే ఏసీ వాడలేని వాళ్లకు ఇది అల్టిమేటింగ్ కూలింగ్ కావడంతో పలువురు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 360 డిగ్రీల డబుల్ హెడ్ రొటేటింగ్ ఫ్యాన్లు మార్కెట్ల అందుబాటులో ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.