- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి

రామగిరి/కమాన్ పూర్ : చట్టానికి లోబడి అధికారులంతా జవాబుదారీతనంతో పని చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కలిసి కమాన్ పూర్ మండలంలో రూ.50 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో తహసీల్దార్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ ప్రజలకు ఉపయోగపడే కార్యాలయాల నిర్మాణ పనులను ప్రజా ప్రభుత్వం చేపడుతుందని, దీనిలో భాగంగానే కమాన్ పూర్, రామగిరి మండల కేంద్రాలలో తహసీల్దార్ కార్యాలయాలు నిర్మిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి వ్యవస్థ వల్ల జరిగిన నష్టాలను భూభారతి చట్టంతో పూడ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మండల కేంద్రాలలో కార్యాలయాలు అంతా ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా అనువైన స్థలాలను ఎంపిక చేయాలని కలెక్టర్ కు సూచించారు. కమార్ పూర్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేపడతామని, దీనికి ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని కోరారు.
షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలిస్తామని వెల్లడించారు. పాఠకుల కోసం ఆధునిక సౌకర్యాలతో గ్రంథాలయం నిర్మిస్తామని అందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. రైతులకు 2 లక్షల రుణ మాఫీ, 500 రూపాయల బోనస్ అందించామని పేర్కొన్నారు. ఉగాది నుండి రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఉద్యమ సమయంలో కూడా కమాన్ పూర్ మండలానికి జూనియర్ కళాశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, హార్టికల్చర్ యూనివర్సిటీ, 130/32 సబ్ స్టేషన్ వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశామని వివరించారు. అనంతరం రామగిరి మండలంలో 65 లక్షలతో చేపట్టిన తహాసీల్దార్ భవన నిర్మాణ పనులకు, 67 లక్షలతో చేపట్టిన కస్తూర్బా గాంధీ విద్యాలయానికి అప్రోచ్ రోడ్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీఓ సురేష్, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.