London : లండన్‌లో అత్యధికులు మాట్లాడే విదేశీ భాష.. బెంగాలీ

by Hajipasha |
London : లండన్‌లో అత్యధికులు మాట్లాడే విదేశీ భాష.. బెంగాలీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచంలోనే టాప్ క్లాస్ నగరాల్లో బ్రిటన్ రాజధాని లండన్ ఒకటి. ఆ నగరంలో అత్యధికులు మాట్లాడే విదేశీ భాష ఏదో తెలుసా ? బెంగాలీ !! ఔను.. లండన్‌లోని సిటీ లిట్ కాలేజీ అధ్యయనంలో ఈవిషయం వెల్లడైంది. లండన్‌లో అత్యధికులు మాట్లాడే విదేశీ భాషల జాబితాలో నంబర్ 1 ప్లేస్‌లో బెంగాలీ, రెండోస్థానంలో పోలిష్ భాష, మూడో స్థానంలో టర్కిష్ భాష ఉన్నాయి. దీన్ని బట్టి లండన్‌లో భాషాపరంగా ఎంతటి వైవిధ్యం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.

తర్వాతి స్థానాల్లో వరుసగా గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, అరబిక్, తమిళ్, ఫ్రెంచ్, పోర్చుగీస్ భాషలు ఉన్నాయి. మొత్తం మీద దాదాపు 5 భారతీయ భాషల పరిమళాలు లండన్‌లో గుబాళిస్తున్నాయన్న మాట. ఈ నగరంలో ఒక్కో ఏరియాలో ఒక్కో దేశం నుంచి వలస వచ్చి స్థిరపడిన వారి ప్రాబల్యం ఉంది. ఆ లెక్క ప్రకారమే ఆయా చోట్ల నివసించే ప్రజలు భాషలను వినియోగిస్తుంటారు.

Advertisement

Next Story