నడుము లోతు నీళ్లలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కారులో ప్రయాణం.. విషయం తెలిస్తే షాకే!

by Aamani |
నడుము లోతు నీళ్లలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కారులో ప్రయాణం.. విషయం తెలిస్తే షాకే!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ప్రపంచ దేశాలు సైతం స్తంభించి పోతున్నాయి.ఈ వర్షాల కారణంగా జన జనజీవనం అతలాకుతలమవుతున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి అత్యవసర ప్రణాళిక ప్రారంభించాలని ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగానే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన ఖరీదైన బ్లాక్ లక్సెస్ కారుతో ఏకంగా నడుములోతు నీటిలోకి వెళ్లారు.

గత కొన్ని రోజులుగా ఉత్తర కొరియాలో కుంభ వృష్టి కురిసింది. చైనా సమీపంలోని సినాయూ, రాజు అనే పట్టణాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వచ్చిన వరదల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి అంచనా వేయాడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు నడుము లోతు నీటిలోకి కారుతో వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 10 విమానాల్లో దాదాపు 4,200 మందిని తరలించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా చెబుతోంది. ఈ కుంభ వృష్టితో వేల మంది నిరాశ్రయులయ్యారు. ఉత్తర కొరియాలో ఈ స్థాయి వర్షపాతం 29 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని దక్షిణ కొరియా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎమర్జెన్సీ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed