- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్ వచ్చి 17 ఏళ్లు.. అందులో ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియో ఇదే..
దిశ, వెబ్‌డెస్క్ః గూగుల్ మాతను ఏమడిగినా ఇట్టే సమగ్ర సమాచారం ఇచ్చేస్తుంది. ఇక, యూట్యూబ్‌లో అంతకుమించే విజువల్స్‌తో సహా సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్ యుగంలో సంచలన సోషల్ మీడియా అయిన యూట్యూబ్ వచ్చి ఇప్పటికి పదిహేడేళ్లు అవుతోంది. వీడియోల హోరుతో విప్లవాలే సృష్టించగలిగిన ఈ యూట్యూబ్‌లో అప్ లోడ్ అయిన మొదటి వీడియో ఎలా ఉంటుందని అనుకుంటున్నారు. 17 ఏళ్ల క్రితం, యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీమ్ యూట్యూబ్‌లో ఈ మొట్టమొదటి వీడియోను అప్‌లోడ్ చేసి, ప్రపంచంలోని ప్రముఖ వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా ఉన్న ఈ సేవను కిక్‌స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ ఇండియా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఇప్పుడు ఆ వీడియోను షేర్ చేయగా, వైరల్‌గా మారింది. "యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన మొట్టమొదటి వీడియో ఇదేనని మేము చెబితే మీరు నమ్ముతారా?" అని ఉన్న ఈ వీడియోలో జావేద్ కరీమ్ శాన్ డియాగో జంతుప్రదర్శనశాలలో ఏనుగుల ఎన్‌క్లోజర్ ముందు వ్లాగ్ చేస్తూ, ఆ ఏనుగులు అసాధారణంగా, పొడవాటి తొండం ఉన్నట్లు చెబుతుంటాడు. 'మీ ఎట్ ద జూ' పేరుతో ఉన్న ఈ వీడియోను యూట్యూబ్‌లో ఏప్రిల్ 24, 2005న పోస్ట్ చేసారు.