- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థాయ్ లాండ్‌లో ప్రతిపక్ష పార్టీల ఘన విజయం
బ్యాంకాక్: థాయ్ లాండ్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు విజయఢంకా మోగించాయి. దీంతో ఆర్మీకి సపోర్ట్ గా ఉండే కొన్ని కన్జర్వేటివ్ పార్టీల పాలనకు తెర పడింది. మూవ్ ఫార్వర్డ్ పార్టీ, ఫ్యూ థాయ్ పార్టీలకు ప్రజలు పట్టం కట్టారు. దేశంలో సంస్కరణలకు పిలుపునిచ్చిన ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా థాయ్‌లాండ్ ఓటర్లు తీర్పును ఇచ్చారు. థాయ్ లాండ్ దిగువ సభలోని 500 సీట్లలో దాదాపు 151 సీట్లను పిటా లిమ్జారోయెన్‌రాట్ నేతృత్వంలోని మూవ్ ఫార్వర్డ్ పార్టీ గెలుచుకుంది. దేశ రాజధాని బ్యాంకాక్‌లోనూ లిబరల్ మూవ్ ఫార్వర్డ్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.
ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి పీటా లిమ్జారోయెన్‌రాట్(42) మాట్లాడుతూ.. తాము తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది సంచలన తీర్పు అని పేర్కొన్నారు. మిలటరీ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని కామెంట్ చేశారు. ఫ్యూ థాయ్ పార్టీతో తాము పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ఫ్యూ థాయ్ పార్టీ నేత పేటోంగ్టార్న్ షినవత్రా కూడా ప్రధాని రేసులో ఉన్నారు.
2001 నుంచి 2006 వరకు తక్షిన్ షినవత్రా దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. తక్షిన్ షినవత్రానే.. ఫ్యూ థాయ్ పార్టీ అధ్యక్షుడు. 2006 నుంచి 2014 వరకు ఆయన సోదరి ఇంగ్లాక్ షినవత్రా ప్రధానిగా కొనసాగారు. తక్షిన్, ఇంగ్లాక్... థాయ్ సైన్యం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడంతో అప్పట్లో పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. తదనంతరం దశాబ్ద కాలం పాటు థాయ్‌లో ఆర్మీ పాలన కొనసాగింది.అయితే ఈసారి కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పలువురి మద్దతును కూడగట్టాల్సి ఉంది. ఈక్రమంలో సెనేట్ సభ్యుల మద్దతు, మిలటరీ పార్టీల సహకారం కూడా అవసరం.