విరుచుకుపడిన ఉక్రెయిన్.. రష్యాలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!

by Hajipasha |
విరుచుకుపడిన ఉక్రెయిన్.. రష్యాలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కొత్త మలుపులు తిరుగుతోంది. అమెరికా, ఐరోపా దేశాల నుంచి అందుతున్న అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై విరుచుకుపడుతోంది. డ్రోన్లు, మిస్సైళ్లతో సరిహద్దులోని రష్యా నగరాలు, గ్రామాలపై భీకర దాడులు చేస్తోంది. ఈక్రమంలోనే తాజాగా రష్యాలోని వొరోనెజ్‌ రీజియన్‌లోని పలు ఏరియాల్లో పుతిన్ సర్కారు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ ప్రాంతంలోని రష్యా ఆర్మీకి చెందిన మందుగుండు గోదాములు లక్ష్యంగా ఉక్రెయిన్ ఆర్మీ డ్రోన్ దాడులు చేసింది. దీంతో ఆ గోదాముల్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగలేదని వొరోనెజ్‌ గవర్నర్‌ అలెగ్జాండర్‌ గుసేవ్‌ వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ రష్యా పర్యటనకు సరిగ్గా ఒకరోజు ముందే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed