- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదటిసారి ఎవరెస్ట్ నుండి పారాచూట్‌తో కిందికి దిగాడు.. వీడియో చూస్తే షాకే!
దిశ, వెబ్‌డెస్క్ః ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ దగ్గరికి గాలిలో ఎగురుతూ వెల్లడం అంత సేఫ్ కాదు గనుకే విమానంలోనో, హెలీకాఫ్టర్‌లోనో ఎవరెస్ట్ పర్వతాన్ని చేరుకోవడం కష్టం. ఇక, పారాచూట్‌లో ఎవరెస్ట్ నుండి ఎగురుతూ కిందకి దిగడం కూడా అంతే కష్టం. అయితే, ఈ సాహసం చేయడానికి కొందరు ముందుకు రాకపోలేదు. అయితే, మొట్టమొదటిసారి అధికారుల అనుమతితో దక్షిణాఫ్రికాకు చెందిన ఒక సాహసోపేతమైన పారాగ్లైడర్ ఈ సాహసం చేశాడు. ఎవరెస్ట్ పర్వతం నుండి మొదటిసారి చట్టపరమైన విమానాన్ని నడిపి, రికార్డు సృష్టించాడు. పియరీ కార్టర్ అనే ఈ పారాగ్లైడర్ దాదాపు 8,000 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిఖరానికి దగ్గరగా హిమాలయాల్లోని మంచుతో కప్పబడిన పర్వతాల చుట్టూ పారాగ్లైడింగ్ చేశాడు.
అతనితో ఉన్న మిగిలిన బృందం కాలినడకన ఎవరెస్ట్ దిగగా, కార్టర్ గంటకు 50 మైళ్ల వేగంతో కిందికి ప్రయాణించాడు. తన గమ్యస్థానాన్ని 20 నిమిషాల్లో చేరుకున్నాడు. 5,164 మీటర్లు, అంటే దాదాపు 3.2 మైళ్ల ఎత్తులో ఉన్న గోరక్షేప్ అనే చిన్న స్థావరం దగ్గరకు కార్టర్ చేరుకోడానికి అంత సమయం పట్టింది. హిమాలయన్ టైమ్స్ ప్రకారం, 56 ఏళ్ల కార్టర్ నేపాలీ అధికారుల నుండి సాంస్కృతిక, పర్యాటక, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన తర్వాత ఈ వెంచర్‌ను పూర్తి చేశాడు.
అయితే, ముందుగా చెప్పుకున్నట్లు ఎవరెస్ట్ పర్వతం నుండి విహారయాత్ర చేసిన ఏకైక వ్యక్తి కార్టర్ మాత్రమే కాదు. ఇప్పటికే ఇలా మూడు బృందాలు ఈ అద్భుతమైన సాహసం చేశాయి. అయితే, నేపాలీ ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా అనుమతి పొందిన తర్వాత ఇలాంటి మైలురాయిని సాధించిన మొదటి వ్యక్తి మాత్రం కార్టర్. ఫ్రెంచ్ ఆల్పినిస్ట్, పైలట్ జీన్-మార్క్ బోవిన్ 1988లో ఎవరెస్ట్ నుండి పారాగ్లైడర్‌పై ఎగరుతూ వచ్చిన మొదటి వ్యక్తి. ఇక, 2001లో ఎవరెస్ట్ నుండి విమానాన్ని నడిపిన రెండవ బృందం బెర్ట్రాండ్ 'జెబులోన్' రోచె, క్లైర్ బెర్నియర్. 10 సంవత్సరాల తర్వాత 2011లో, సనో బాబు సునువార్, లక్ప త్షెరి షెర్పా టెన్డంలు ఫ్లైట్‌పై ఎవరెస్ట్ నుండి దూకిన మొదటి నేపాలీ పారాగ్లైడర్‌లుగా నిలిచారు.