- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భవిష్యత్ వ్యోమగాములకు ఆశ్రయం!.. చంద్రునిపై పెద్ద గుహను కనుగొన్న శాస్త్రవేత్తలు
దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చంద్రునిపై ఒక పెద్ద గుహను గుర్తించింది. 55 ఏళ్ల క్రితం వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్‌లు తమ చారిత్రాత్మక మూన్‌వాక్ చేసిన సముద్రంలోని అపోలో 11 ల్యాండింగ్ సైట్ నుంచి కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఈ గుహను కనుగొన్నారు. భవిష్యత్తులో చంద్రునిపై నివాసాలు ఏర్పాటు చేసేందుకు ఇది మార్గాన్ని సుగమం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ సేకరించిన రాడార్ డేటాను విశ్లేషించిన ఇటాలియన్ నేతృత్వంలోని పరిశోధనా బృందం దీనిని నిర్ధారించింది. చంద్రుని ఉపరితలం నుంచి 150 మీటర్ల దిగువన ఈ గుహ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటలీలోని ట్రెంటో విశ్వవిద్యాలయానికి చెందిన లోరెంజో బ్రూజోన్ గుహను ఖాళీ లావా ట్యూబ్‌గా అభివర్ణించారు. భవిష్యత్తులో చంద్రుని అన్వేషకులకు ఇటువంటి లక్షణాలు సహజ ఆశ్రయాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. ‘చంద్ర గుహలు 50 సంవత్సరాలుగా మిస్టరీగా మిగిలిపోయాయి. కానీ ఎట్టకేలకు ఒక ఉనికిని నిరూపించడం చాలా ఉత్సాహంగా ఉంది’ అని అన్నారు.