ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి: ప్రతీకారం తప్పదని జెలెన్ స్కీ వార్నింగ్

by samatah |
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి: ప్రతీకారం తప్పదని జెలెన్ స్కీ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. ఉక్రెయిన్‌పై తాజాగా రష్యా క్షిపణి దాడికి పాల్పడింది. సెంట్రల్ సిటీ డ్నిప్రోపై వైమాణిక దాడి చేసింది. ఈ ఘటనలో 18మంది తీవ్రంగా గాయపడ్టట్టు స్థానిక గవర్నర్ సెర్గీ లైసాక్ వెల్లడించారు. సహాయక చర్యలు చేపట్టి వారందరినీ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. క్షతగాత్రుల్లో ఐదుగురు పిల్లలు ఉన్నట్టు చెప్పారు. అయితే వారి పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. క్షిపణి ఓ కళాశాలపై పడినట్టు తెలిపారు. కాగా, డ్నిప్రో అనేది మధ్య ఉక్రెయిన్‌లోని ఓ నగరం. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇది రష్యా దాడులకు లక్ష్యంగా ఉంది.

ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. రష్యా దాడితో విద్యా సౌకర్యాలు దెబ్బతిన్నాయని తెలిపారు. రెస్య్కూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ దాడులకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాలని పాశ్చాత్య దేశాలకు పిలుపునిచ్చారు. కాగా, 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరు దేశాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. అయినప్పటికీ యుద్ధాన్ని ఆపూ సూచనలు కనిపించకపోవడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలకు గురిచేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed