- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Russia - Ukraine War : రష్యాలోని భారతీయ పౌరులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
దిశ, వెబ్‌డెస్క్ : రష్యాలో నెలకొన్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న ఘర్షణ వాతావరణం మరింత తీవ్రరూపాన్ని దాల్చింది.ఇప్పటికే రష్యాలోని వెయ్యి కిలోమీటర్ల మేర భూభాగాన్ని ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ఇప్పుడు మరింత దూకుడును పెంచినట్లు తెలుస్తోంది . రష్యాలోని దాదాపుగా 74 నివాస ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామని, కుర్స్కు ప్రాంతంలో మరింత ముందుకు సాగుతున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇది వరకే వెల్లడించారు. కుర్స్కు రీజియన్‌లోకి ఉక్రెయిన్ బలగాల చొరబాటుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. కీవ్‌పై మరిన్ని దాడులు ఉంటాయని హెచ్చరించారు.దీంతో ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
కాగా, ఈ పరిణామాలతో భారత్ అప్రమత్తమైంది. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు నిచ్చితంగా పరిశీలిస్తోంది.ఈ మేరకు రష్యాలో మాస్కోలోని భారత రాయబార కార్యాలయం అక్కడి పౌరులకు కీలక సూచన చేసింది.రష్యాలోని పలు ప్రాంతాల్లోకి ఉక్రెయిన్ బలగాలు దూసుకొస్తున్న నేపథ్యంలో కర్స్కు ప్రాంతంలో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుతానికి ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిపోవాలని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.